జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

261

దిశ, జనగామ: వాకింగ్ కు వెళ్లిన ఓ మాజీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురైన ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ పులి స్వామి (55) ఇంటి నుంచి హన్మకొండలోని సాంఘీక గురుకుల పాఠశాల వైపు గురువారం ఉదయం వాకింగ్ కొరకు వెళ్లారు. ఈక్రమంలో స్వామిని నడి రోడ్డుపై గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో హత్య చేసి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఏసీపీ వినోద్ కుమార్, సీఐ మల్లేశ్ యాదవ్ ఘటన స్టలికి చేరుకుని పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బైక్‌ను ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేయడం జరిగిందన్నారు. పులి స్వామి హత్యకు ప్రధానంగా భూతగాదాలే కారణమని అనుమానిస్తున్నారు. బుధవారం ఓ భూతగాద కేసులో స్వామికి అనుకులంగా తీప్పువచ్చిందని కేసుపై పుర్ధి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఏసీపీ వినోద్ కుమార్ వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..