‘ప్రజల ప్రాణాలకన్నా కక్షలే ఎక్కువ’.. వైసీపీపై టీడీపీ నేత ఫైర్..

by  |
aachennayudu
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు ఒమిక్రాన్ తరుముకొస్తుంటే వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం వెనకబడి ఉందన్నారు.

ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందుంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ముందుందని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమన్నారు. అసలు వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో ఉన్నారా? లేరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Next Story