అచ్చెన్న సింపతీ అస్త్రం.. ఓటమి పాలైన వైసీపీ

by  |
అచ్చెన్న సింపతీ అస్త్రం.. ఓటమి పాలైన వైసీపీ
X

దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీ సాధించినా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో అధికార పార్టీ వైసీపీ షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామమే నిమ్మాడ. గత 40ఏళ్లుగా కింజరాపు కుటుంబ సభ్యులు నిమ్మాడ పంచాయతీలో ఆధిపత్యం చెలాయించేవారు.కానీ గత కొంతకాలంగా ఆ కుటుంబంలో చీలికలు రావడంతో పోటీ అనివార్యం అయ్యింది. దీంతో కింజారాపు కుటంబంలోని ఓ వర్గానికి చెందిన అప్పన్నకు వైసీపీ మద్దతు తెలపగా.., అదే కుటుంబానికి చెందిన సురేష్ కు టీడీపీ మద్దతు పలికింది.

అయితే వైసీపీ బలపరిచిన అభ్యర్ధి అప్పన్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం పై నుంచి అప్పన్న పోటీ చేయడంపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోటీపై పునరాలోచించుకోవాలని ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. దీంతో సదరు అభ్యర్ధిని అచ్చెన్నాయుడు బెదిరిస్తున్నారంటూ ఆయనపై కేసు నమోదైంది. జైలు శిక్షను అనుభవించారు.

జైలు విడుదల అనంతరం అచ్చెన్న భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని,వాటికి తాను భయపడేది లేదంటూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆ భావోద్వేగమే టీడీపీ బలపరిచిన అభ్యర్ధి సురేష్ గెలుపు సునాయాసమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడుకి జైలుశిక్ష, మరోవైపు భావోద్వేగం టీడీపీకి అనుకూలంగా మారి మంగళవారం విడుదలైన నిమ్మాడ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి అప్పన్నపై 1,700 ఓట్ల మెజార్టీతో సురేష్ విజయం సాధించారు. అప్పన్నకు కేవలం 157 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.



Next Story