కమర్షియల్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

by  |
Tata Motors
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను అక్టోబర్ 1 నుంచి పెంచనున్నట్టు మంగళవారం ప్రకటించింది. వాహన మోడల్, వేరియంట్‌ని బట్టి 2 శాతం వరకు ఈ పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వాహనాల తయారీలో కీలకమైన వస్తువులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఉక్కు, ఇతర విలువైన లోహాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల సంస్థ ఇందులో కొంత భారాన్ని వినియోగదారులపై వేయక తప్పటంలేదు.

వివిధ స్థాయిల్లో తయారీ ఖర్చులను పరిశీలిస్తూ ధరల పెరుగుదలను వీలైనంత తగ్గించేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. కాగా, టాటా మోటార్స్ గత రెండు నెలల కాలంలో ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు ఆగష్టులో ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాల ధరలను సగటున 0.8 శాతం పెంచింది. ‘గడిచిన ఏడాది కాలంలో మెటల్, ఇతర విలువైన పరికరాల ధరలు భారీగా పెరిగాయి. కనీసం 8-8.5 శాతం మేర ప్రభావాన్ని ఎదుర్కొన్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.

Next Story