కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు
X

దిశ,చిలిపిచెడ్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం చిలిపిచెడ్ మండలంలో పలు గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని రాందాస్ గూడ, సోమక్కపేట, రహీంగూడ, శీలంపల్లి ఫైజాబాద్, బండపోతుగళ్,అజ్జమర్రి, గంగారాం గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని దుయ్యపట్టారు. కాంగ్రెస్ ఒట్లు, తిట్లతో రాజకీయం చేస్తుంటే, బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. వెంకట్రామిరెడ్డి మంచిగా చదువుకున్న వ్యక్తి అని, కేసీఆర్ బలపరిచిన ఆయనకు భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ముందుగా రాందాసుగూడ గ్రామంలోని

రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి జడ్పీ కోఆప్షన్ నెంబర్ మన్సూర్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోల అశోక్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ధర్మారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed