టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీక్వెన్స్‌లో తార

51

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫ్రాంచైజ్ హీరోపంతి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. అహ్మద్ ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సాజిద్ నడియాడ్వాల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌ను ఫైనల్ చేశారు. హాట్ బ్యూటీ తారా సుతారియాను టైగర్ ష్రాఫ్‌కు సరిజోడిగా డిసైడ్ చేసిన యూనిట్..దీనిపై అధికారిక ప్రకటన చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో టైగర్, తార కెమిస్ట్రీని ప్రేక్షకులు ఆదరించారని..అదే కెమిస్ట్రీ రిపీట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. హీరోపంతి బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయగా.. దీని సీక్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

తనపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాత సాజిద్‌కు థాంక్స్ చెప్పింది తారా సుతారియా. నా ఫేవరెట్స్‌తో మళ్లీ వర్క్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. బర్త్ డే మంత్ ఇంత గొప్పగా స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పింది. కాగా, నవంబర్ 19న 25వ పుట్టినరోజు జరుపుకోబోతుంది తార.