పెట్రోల్ ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

by  |
tn govt
X

దిశ , వెబ్ డెస్క్; దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతుంటే కొత్తగా ఏర్పడిన డిఎంకే ప్రభుత్వం మాత్రం ధరలు పెంచబోమని చెప్తోంది. అంతే కాకుండా మధ్యంతర బడ్జెట్ లో భాగంగా పెట్రోల్ పై 3 రూపాయలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమ రాష్ట్ర ప్రజల పై పెట్రోల్ బాదుడు వద్దు అని డీఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సందర్భంగా తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదలకు మేలు చేయడానికి వెనకాడదని, తమ ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారని అన్నారు.

ప్రతి పక్షాలు కావాలనే ఈ విషయం పై రాద్దాంతం చేస్తున్నాయని మండి పడ్డారు. ఎన్నికల తర్వాత ప్రవేశ పెట్టే బడ్జెట్టే మధ్యంతర బడ్జెట్ . తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తామని, వాటికి ఎవరు అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గమన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతాం అని ప్రకటించారు. ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా సెప్టెంబర్ 21 వరకూ జరుగుతాయి.

Next Story

Most Viewed