స్విగ్గీ, జొమాటో, డొమినోస్… ఇంటికే నిత్యావసర వస్తువులు

by  |
స్విగ్గీ, జొమాటో, డొమినోస్… ఇంటికే నిత్యావసర వస్తువులు
X

దిశ వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ పోతోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మరో 19 రోజులు పొడగించారు. ఇప్పటికే తొలి దశ లాక్ డౌన్ 21 రోజులు పూర్తి అయ్యింది. నిత్యావసర వస్తువుల కోసం చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని దుకాణాల్లో వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటితో పాటు ఇప్పటివరకు ఆన్ లైన్ గ్రాసరీ కోసం.. గ్రోఫర్స్, బిగ్ బాస్కట్ మరికొన్నింటిపై అధారపడ్డాం. లాక్ డౌన్ నేపథ్యంలో ఫుడ్ డెలీవరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో లు కూడా నిత్యావసర వస్తువులను ఇంటికే అందిస్తున్నాయి. డొమినోస్ కూడా ఈ జాబితాలో చేరింది.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో .. ఇంటి నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. అత్యవసరమున్న సందర్భాల్లో ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని ప్రభుత్వాలు నిబంధనలు విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో .. చాలా మంది నిత్యావసర విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొందరు షాప్ యజమానులు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ఎక్కువ ధరలకు అమ్ముతుండటం కూడా వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. వీటిన్నంటి దృష్ట్యా వినియోగదారుల కోసం .. డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్ వంటి సంస్థలు కూడా తమ పరిధిలో హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఆన్ లైన్ లో వీటితో పాటు బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ కూడా సరుకులను ఇంటికి చేరుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ జాబితాలో స్విగ్గీ, జొమాటో, డొమినోస్ లు కూడా చేరాయి.

125 నగరాల్లో స్విగ్గీ :

ప్రధానమైన ఫుడ్ డెలివరీ యాప్ లలో ‘స్విగ్గీ’కూడా ఒకటి. లాక్ డౌన్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ చేయడం లేదు. అయితే ఇటీవలే టైర్ 1, టైర్ 2 నగరాల్లో నిత్యావసర వస్తువుల సేవలను ప్రారంభించిన స్విగ్గీ.. వీటిని ప్రస్తుత్తం 125 నగరాలకు విస్తరించింది. వినియోగదారులకు సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వారికి కావాల్సిన సరుకులను స్విగ్గీ ఇంటికే డెలివరీ చేయనుంది. ఇందుకు వినియోగదారులు యాప్ లో ‘గ్రాసరీ’ సెక్షన్ ను ఎంచుకుని ఆర్డర్ చేసుకోవాలి. మనకు నచ్చిన స్టోర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ‘నో కాంటాక్ట్ ’ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. నిత్యావసరాలు, గ్రాసరీలను కూడా ఇకనుంచి తమ సంస్థ డెలివరీ చేస్తుందని, అందుకోసం అనేక జాతీయస్థాయి ఉత్పత్తి సంస్థలు, బ్రాండులతో ఒప్పందాలు చేసుకున్నామని స్విగ్గీ సీవోవో వివేక్ సుందర్ సోమవారం ప్రకటించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, డాబర్, మారికో, విషాల్‌మెగా మార్ట్, సిప్లా , గోద్రెజ్, అదానీ, తదితర సంస్థలు ఉన్నాయని తెలిపారు. తమ సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలో గ్రాసరీలు ప్రముఖంగా ఉంటాయని వెల్లడించారు. స్విగ్గిలో ఎప్పటినుంచో నిత్యావసరాలు చేర్చాలని భావించామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు. సరుకులు మనం ఆర్డర్ చేసిన రెండు గంటల్లో హోం డెలవరీ చేస్తామని వివరించారు.

80 నగరాల్లో జొమాటో :

జోమాటో కూడా నిత్యావసర వస్తువులను ఇంటికే చేర్చనుంది. ఇందుకోసం విశాల్ మెగామార్ట్ తో పాటు, మరికొన్ని ఎఫ్ఎమ్ సీజీ సంస్థలతో జోమాటో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం 80 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుడు ఒకేసారి 12 కేజీలకు మించి ఆర్డర్ చేయకూడదు. కేవలం గంట వ్యవధిలో హోడ్ డెలీవరీ చేస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. అంతేకాదు జోమాటో ఫుడ్ డెలీవరీ కూడా కొనసాగిస్తుంది. కానీ అది కేవలం ఒంటరిగా ఉంటున్నవాల్ల కోసమేనని స్పష్టం చేసింది.

అదే బాటలో :

పిజ్జా, బర్గర్లు అందించే డొమినోస్ కూడా .. గ్రాసరీ అందిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. కాని కొన్ని నగరాల్లో దాని సేవలను అందిస్తుంది. షాప్ క్లూస్ కూడా గ్రాసరీ అందిస్తామని ప్రకంటించింది. కానీ అందులో అన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో లేవు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ లు ఎప్పటి నుంచో ఈ సేవలు అందిస్తున్నప్పటికీ … కొత్త ఆర్డర్ లో తీసుకోవడంలో కాస్త వెనుకంజ చూపుతున్నాయి. అంతేకాదు స్విగ్గీ, జోమాటలతో పోల్చితే డెలివరీ కూడా చాలా లేట్ గా ఉంటుంది.

Tags : lockdown, groceries, essential goods, swiggy, zomato, dominos, home deliver


Next Story

Most Viewed