SWIGGY సరికొత్త ఆలోచన.. డెలివరీ బాయ్స్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్స్

by  |
swiggy charge bikes
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ తన డెలివరీ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించనున్నట్టు గురువారం ప్రకటించింది. భవిష్యత్తును ఉద్దేశించి కాలుష్య రహితంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తన డెలివరీ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు, బ్యాటరీ స్టేషన్‌లను నిర్మించేందుకు రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ప్రతిరోజూ 8 లక్షల కిలోమీటర్లకు విస్తరించే డెలివరీలను లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా డెలివరీలను నిర్వహిస్తే వాహనాల జీవిత కాల వ్యయం 40 శాతం వరకు తగ్గుతుంది.

దీనివల్ల స్విగ్గీ డెలివరీ భాగస్వాములు అధిక ఆదాయానికి అవకాశం ఉంటుంది. స్విగ్గీ భాగస్వాములకు రోజుకు సగటున 80-100 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ వివరించింది. ‘వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్యకలాపాల విభాగంలో డెలివరీలను మరింత స్థిరంగా, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని’ స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ముఖ్యమైన దశ. పర్యావరణ పరంగానే కాకుండా డెలివరీ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed