రిపబ్లిక్ చానల్‌పై మండిపడ్డ ‘స్వర’

by  |
రిపబ్లిక్ చానల్‌పై మండిపడ్డ ‘స్వర’
X

హీరోయిన్ స్వర భాస్కర్.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అన్ని విషయాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటుంది. నెపోటిజం విషయంలో తాప్సీతో కలిసి కంగనా రనౌత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భామ.. సుశాంత్ సింగ్ మరణాన్ని కంగనా వాడుకునేందుకు ట్రై చేస్తోందని మండిపడింది.

కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్స్ మేనేజర్ దిశ ఆత్మహత్య కేసు గురించి తాజాగా స్పందించింది స్వర. హోప్ఇండియా వెబ్‌సైట్, రిపబ్లిక్ టీవీ చానెల్‌.. దిశ చనిపోయినప్పుడు బాడీ మీద అసలు ఎలాంటి వస్త్రాలు లేవని ప్రచారం చేశాయి. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు ఇది అవాస్తవమని చెప్పారు. జోన్ 11 డీసీపీ విశాల్ ఠాకుర్ దీనిపై క్లారిటీనిచ్చారు. దిశ ఆత్మహత్య చేసుకున్నదనే సమాచారం అందగానే వెంటనే అక్కడకి చేరుకున్నామని .. పంచనామా నిర్వహించామని తెలిపారు. ఆ సమయంలో దిశ తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పారు.

పోలీసుల స్టేట్‌మెంట్‌తో ఈ ఘటనపై స్పందించిన స్వర.. ఇలాంటి మీడియా సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రిపబ్లిక్ టీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి మీడియా సంస్థలు సమాజంలో విష పురుగుల వంటివని.. ఎంత మాత్రం మంచివి కాదని చెప్పింది. మీడియా అంటే బాధ్యతాయుతంగా పనిచేయాలే తప్ప.. సమాజంపై విషం చిమ్మకూడదని ఆగ్రహం వ్యక్తం చేసిన స్వర.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది.



Next Story

Most Viewed