సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కంపెనీ హెడ్‌గా సతోషి!

58

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్యకలాపాల్లో మార్పుల నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్ఎంఐపీఎల్) గురువారం కొత్త కంపెనీ హెడ్‌గా సతోషి ఉచిడాను నియమించింది. గతంలో సతోషి సుజుకి కంపెనీ మిడిల్ ఈస్ట్, ఇండియా మోటార్ సైకిల్ ఆపరేషన్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. సతోషి నియామకం ద్వారా కంపెనీ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు, దేశీయ మార్కెట్లో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు సహకారం లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

‘భారత్‌లో ఇదివరకు నిర్వహించిన బాధ్యతల అనుభవం ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత్‌లో కంపెనీ వృద్ధికి బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని’ సతోషి ఉచిడా అన్నారు. ప్రపంచంలో టూ-వీలర్ తయారీలో మెరుగైన వృద్ధి కలిగిన మార్కెట్లలో భారత్ ఒకటని సతోషి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారత్‌లో కంపెనీ కార్యకలాపాల ద్వారా టూ-వీలర్ వాహనాలను దేశీయ డిమాండ్ తీర్చడమే కాకుండా విదేశీ మార్కెట్లలోని డిమాండ్‌ను కూడా తీరుస్తుందని కంపెనీ వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..