జగదీశ్ రెడ్డి రాజీనామా చేస్తేనే సూర్యాపేట అభివృద్ధి: సంకినేని

by  |
Sankineni
X

దిశ, ఆత్మకూర్ (ఎస్) : సూర్యాపేట అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఆ పరిస్థితికి తీసుకువచ్చాడని మండిపడ్డారు. గురువారం ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలాపురంలో వివిధ పార్టీలకు చెందిన 50మంది కార్యకర్తలు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే విద్య, వైద్యం, నివాసం ఉచితంగా ఇస్తామన్నారు. గత ఏడాది పంట నష్టం కింద కేంద్రం రూ.900 కోట్లు ఇస్తే రాష్ట్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఎన్నికలు అయ్యాక వాటిని గాలికి వదిలేస్తోందని విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 ఉన్న మద్యాన్ని రూ.200 చేసిందని సంకినేని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే దేశంలోని అందరు ముఖ్యమంత్రులు సహకరించాలని సంకినేని అభిప్రాయపడ్డారు. ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందని గుర్తు చేశారు.

తాత్కాలిక ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు 5 వేల ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, తూడి సారయ్య, అస్లాం, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సంద్యాల సైదులు, కాప రవి, పాటి కర్ణాకర్ రెడ్డి, అభిద్, గంధం యాదయ్య, చందు, మల్సూర్, గోపగాని రామకృష్ణ, మర్రు లక్ష్మణ్ రావు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed