హ్యాండిచ్చిన విక్రమ్.. రెట్టింపు ఉత్సాహంతో దూసుకొచ్చిన టీమ్

86
Suriyaputra Mahaveer Karna

దిశ, సినిమా: భారత ఇతిహాసం మహాభారతాన్ని కర్ణుడి కోణంలో చూపించే క్రమంలో బాలీవుడ్ నుంచి మరో ప్రాజెక్ట్ రాబోతోంది. మహవీర్ కర్ణ జీవితకథను ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు వషు భగ్నాని, దీప్షికా దేశ్ ముఖ్, జాకీ భగ్నాని. గతంలో విక్రమ్ టైటిల్ రోల్‌లో ప్రకటించిన ప్రాజెక్ట్ ఇదే కాగా.. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మ్యాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్ట్ కోసం ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు చియాన్. దీంతో మరో స్టార్‌తో సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ‘సూర్యపుత్ర మహవీర్ కర్ణ’ అఫిషియల్ మూవీ లోగోను రిలీజ్ చేశారు. బెంచ్ మార్క్ విజువల్ ఎఫెక్ట్స్‌తో వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.. సినిమాను భారీ లెవల్‌లో తీసుకురాబోతున్నారు. ఆర్‌ఎస్ విమల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా కవి, డాక్టర్ కుమార్ విశ్వాస్ తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. డైలాగ్, లిరిక్స్ అందించంతో పాటు స్క్రీన్‌ప్లే విభాగంలోనూ ఆయన సేవలు అందించనున్నారు. కాగా ‘సూర్యపుత్ర మహవీర్ కర్ణ’ను హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..