సందీప్ కిషన్ బర్త్ డే ట్రీట్

by  |
సందీప్ కిషన్ బర్త్ డే ట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్: యువ కథానాయకుడు సందీప్ కిష‌న్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ చిత్రాల్లోనూ సందీప్ నటించిన విషయం మనందరికీ తెలుసు. సందీప్ బర్త్ డే (మే 7 ) సందర్భంగా నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్టాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి.రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రానికి భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్నారు. ఈ చిత్రం అంద‌మైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుందని చెబుతున్నారు. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాణ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రంలో ఆయ‌న న‌టించ‌నున్నారు.

ఓటీటీ లో సందీప్ సినిమా :

సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ‘డీకే బోస్’ సినిమాకు ఏఎన్ బోస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2013లో విడుదలకావాల్సింది. కానీ, పలు కారణాలతో ఆగిపోయింది. సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆనంద్ రంగ స్పష్టం చేశారు. ఇందులోని “పడిపోయా” అనే సాంగ్ ఫుల్ వీడియోను ఈ రోజు విడుదల చేశారు.. ప్రస్తుతం ఓటీటీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు

Tags: sundeep kishan, OTT, new movie, dk bose

Next Story

Most Viewed