ఆపిల్‌తో కలిసి కాంటాక్ట్ ట్రేసింగ్: సుందర్ పిచాయ్

by  |
ఆపిల్‌తో కలిసి కాంటాక్ట్ ట్రేసింగ్: సుందర్ పిచాయ్
X

దిశ, సెంట్రల్ డెస్క్: సాఫ్ట్‌వేర్ రంగంలోని అనేక కంపెనీల మీద కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు ప్రస్తుత ఏడాది చివరి వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్ సంస్థ దీన్ని ఖరారు చేయగా, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ముందుగా తమ కంపెనీలో ఉద్యోగులకు భద్రతను ఇస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, ప్రజలకు సమాచారం అందించడంలో సాయం అందించేందుకు నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. అలాగే, తమ సంస్థ నుంచి ఉత్పత్తులు, సేవలను కొన్ని కంపెనీలు, ఆఫీసులకు అందించే విషయంపై దృష్టి సారించినట్టు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులు చేసిన సృజనాత్మక, పరిశోధనాత్మక సర్వేలను, డేటాను తెలుసుకుంటున్నామని ఆయన తెలిపారు. కంపెనీ అభివృద్ధి అంశంలో సానుకూలంగా వ్యవహరిస్తూ కొత్త ప్రాజెక్టులను, ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రణాళికల అభివృద్ధిని సాధించడానికి ఉద్యోగులందరూ పని ప్రదేశాల్లో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపిల్ సంస్థతో కలిసి ఆరోగ్య సంస్థలకు అవసరమైన కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీని రూపొందించే పనిలో ఉన్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.


Next Story

Most Viewed