వృద్ధ దంపతుల ఆత్మహత్య

by  |
వృద్ధ దంపతుల ఆత్మహత్య
X

దిశ అశ్వారావుపేట: ఆనారోగ్యంతో బాధ పడుతూ ఆ బాధను భరించలేక వృద్ధ దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన దోపుకుంట్ల భూషణం (75), ఆదిలక్ష్మి (70) దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ బాధను భరించలేక బలవన్మరణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story