సే నో టూ షుగర్ డ్రింక్స్

by  |
సే నో టూ షుగర్ డ్రింక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలంలో గొంతు తడారితే చాలనుకొని చల్లచల్లనీ షుగర్ డ్రింక్ తాగేస్తాం. బారసాల నుంచి పెళ్లి వరకు ఏ ఫంక్షన్ జరిగినా కూల్ డ్రింక్స్ ఉండాల్సిందే. అయితే తరచూ షుగర్ డ్రింక్స్ తాగడం వల్ల మహిళల్లో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది. షుగర్ ను లిక్విడ్ ఫామ్ లో తీసుకోవడం చాలా పెద్ద రిస్క్ అని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. లిక్విడ్ షుగర్ అనేది హైలీ కానెసెంట్రేడ్. లిక్విడ్ రూపంలో ఉండటంతో ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి కేలరీలు ఉండవు. న్యూట్రిషన్ లేని కేలరీల వల్ల ఉపయోగముండదు. షుగర్ డ్రింక్స్ అత్యంత ఫ్యాట్ కలగజేస్తాయి.
ప్రతిరోజు షుగర్ డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ (సీవీడీ) డిసీజ్ వచ్చే ముప్పు అధికంగా ఉందని అమెరికా హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితమైన ఓ స్టడీ తేల్చింది.
20 సంవత్సరాల నుంచి తరచూ షుగర్ డ్రింక్స్ తీసుకున్న లక్ష మంది మహిళలపై ఈ అధ్యయనం జరిగింది. ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లం వస్తాయి.
1. బరువు పెరగడం :
షుగర్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రోటీన్లు కానీ, కేలరీలు కానీ అందవు. అయితే, ఆటోమేటిక్ గా బరువు పెరుగుతారు. అంతేకాదు మెటాబాలిక్ డిసీజ్ లు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి.
2. డయాబెట్స్ :
డయాబెట్స్ ఉన్నవాళ్లు షుగర్ డ్రింక్స్ తో పాటు, డైట్ సోడా, డైట్ కూల్ డ్రింక్స్ కూడా తాగకపోవడమే మంచిది. చాలా మంది డైట్ డ్రింక్స్ లో జోరో షుగర్, లో కెలోరీస్ అని రాస్తారు. దాని అర్థం .. అందులో షుగర్, కేలోరీలు లేవని కాదు. అందులో న్యూట్రిటివ్ వ్యాల్యూ ఉండవు. ఇలాంటి డ్రింక్స్ బదులు బట్టర్ మిల్క్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ , గ్రీన్ టీ తాగడం ఎంతో మంచిది.
3. బెల్లీ ఫ్యాట్ :
ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ తప్పకుండా అవుతాం. దీనివల్ల పొట్ట చుట్టూ ఆ కొవ్వు పేరుకుపోతోంది. పొట్ట రావడం వల్ల డయాబెట్స్, హార్ట్ డిసీజ్ వచ్చే ముప్పు కూడా అధికమే.
4. అడిక్టివ్ :
షుగర్ డ్రింక్స్ ప్రభావం బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ పై ఉంటుంది. దాని వల్లే వీటిని తరుచుగా తాగడం వల్ల.. వీటికి అడిక్ట్ అయిపోతాం. అందువల్లే వీటిని మానేయడం అంత సులభం కాదు.
5. డెంటల్ హెల్త్ :
సోడా లో ఫాస్పరిక్, కార్బోనిక్ యాసిడ్ ఉంటాయి. ఈ యాసిడ్లు దంతాలపై ప్రభావం చూపుతాయి. ఈ యాసిడ్లు షుగర్ తో యాడ్ కావడం వల్ల మరింత ముప్పు ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియాను షుగర్ పెంచుతుంది.
షుగరీ డ్రింక్స్ లిస్ట్ : కూల్ డ్రింక్స్ (బేవరేజస్) అన్నీ కూడా షుగర్ డ్రింక్సే. వీటిలో యాడెడ్ షుగర్ లేదా స్వీటనర్స్ ఉంటాయి. సోడా, కార్బోనేటేడ్ సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఫ్రూట్ ఫ్లేవర్డ్, పౌడర్డ్, విటమిన్ ఎన్హన్సడ్ డ్రింక్స్.
షుగర్ ఎంత మొత్తంలో తీసుకోవాలి :
రెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు యాడెడ్ షుగర్ కూల్ డ్రింక్స్ తాగించకూడదు. రెండేళ్ల వయసున్న చిన్నారులతో పాటు మహిళలు కూడా రోజులో 100 కెలోరీలకు మించిన యాడెడ్ షుగర్ తీసుకోవద్దు. అదే పురుషులైతే 150 కెలోరీలు తీసుకోవచ్చు. రెండేళ్ల చిన్నారులు, మహిళలు రోజులో 6 టీ స్పూన్ల చక్కెర తీసుకోవచ్చు. పురుషులు రోజులో 9 టీ స్పూన్లు చక్కెర మించి తీసుకోవద్దు. ఒక టీ స్పూన్ షుగర్ .. నాలుగు గ్రాములతో, 16 కెలోరీలతో సమానం.


Next Story

Most Viewed