రూ. 5 వేలు ఇవ్వొద్దు.. ఆఫీస్‌కు వచ్చి తీసుకోండి: అధికారులు

by  |
రూ. 5 వేలు ఇవ్వొద్దు.. ఆఫీస్‌కు వచ్చి తీసుకోండి: అధికారులు
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ స్కూళ్లలో బుధవారం రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించారు. ఈ తనిఖీల్లో భాగంగా 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 2 మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో రవాణాశాఖ అధికారి శ్యామ్ నాయక్, ఎంవీఐ అభిలాశ్ లు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ. 5000 ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని, ప్రజలు నేరుగా అఫిస్ కు వచ్చి లైసెన్స్ తీసుకోవాలని అధికారులు సూచించారు.


Next Story

Most Viewed