డాక్టర్లకు ‘సైకత’ సెల్యూట్

by  |
డాక్టర్లకు ‘సైకత’ సెల్యూట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సామాజిక అంశంపైనా తనదైన ‘సైకత శిల్పాల(శాండ్ ఆర్ట్)తో ప్రజలను చైతన్యపరుస్తుంటాడు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ప్రస్తుతం.. ‘కొవిడ్-19’పై పోరాటంలోనూ తనదైన పాత్ర పోషిస్తూ, అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నారు. ఇప్పటికే కరోనాపై పలు సైకత శిల్పాలను రూపొందించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. తను వేసిన 5 సైకత శిల్పాలను ఆన్‌లైన్ లో వేలం వేసి వచ్చిన డబ్బులను పీఎం కేర్, ఒడిస్సా సీఎంఆర్‌ ఎఫ్‌కు అందించాడు. ప్రధాని మోదీ పిలుపు మేరకు తాను రూపొందించిన శాండ్ ఆర్ట్‌లో దీపాలను వెలిగించి కోవిడ్‌పై సమరానికి యావత్ దేశం ఒక్కతాటిపై నిలుస్తుందన్నారు. కరోనా వైరస్ బాధితులను రక్షించడంలో డాక్టర్లు చేస్తున్న సేవలకుగానూ వారికి సెల్యూట్ చేస్తూ సైకత శిల్పాన్ని రూపొందించారు.

కరోనా మహమ్మారి కారణంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముందుండి కరోనా బాధితులను కాపాడుతున్నారు. తన ప్రాణాలను పణం పెట్టి కరోనా పై యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ల త్యాగాన్ని గుర్తించి ప్రధాని నుంచి ఆమ్ ఆద్మీ వరకు అందరూ వాళ్ల సేవల్ని కొనియాడారు. చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. సంగీత కళాకారులంతా పాటలతో డాక్టర్ల సేవలను అభినందించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా.. డాక్టర్లను అభినందిస్తూ సెల్యూట్ టూ హీరోస్ అనే సైకతాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘సెల్యూట్ టూ డాక్టర్స్, నర్సెస్, ఆల్ హెల్త్ వర్కర్స్’ అనే క్యాప్షన్ ను జతచేశారు. దీన్ని పూరి సముద్ర తీరంలో రూపొందించారు. గతంలోనూ పోలీసుల సేవలను కొనియాడుతూ.. ‘వి స్టాండ్ ఫర్ యూ.. స్టే హోం.. స్టే సేఫ్ ’అనే నినాదాలతో సైకత శిల్పాలను రూపొందించారు.

tags :covid 19, corona pandemic, sand art, sudarshan pattnaik, puri

Next Story

Most Viewed