తెలంగాణ మౌలిక సదుపాయాలు (గ్రూప్-2, 3,4 జేఎల్ అండ్ పోలీస్ జాబ్స్ ప్రత్యేకం)

by Disha Web Desk 17 |
తెలంగాణ మౌలిక సదుపాయాలు (గ్రూప్-2, 3,4 జేఎల్ అండ్ పోలీస్ జాబ్స్ ప్రత్యేకం)
X

మౌలిక సదుపాయం అనగా ఒక ప్రాంతం.. ప్రాథమిక భౌతిక వ్యవస్థలైన రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, మురుగునీరు, నీటి సదుపాయంతో పాటు విద్యుచ్ఛక్తి వ్యవస్థలు. అలాగే భౌతికమైన మౌలిక సదుపాయాలు అనగా ప్రజా సేవలు, పరిశ్రమలు, ఆరోగ్యం, విద్యా. రవాణా వ్యవస్థలు.

తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం.. భూ రవాణా మౌలిక సదుపాయం చాలా ముఖ్యమైన అంశం.

తెలంగాణలో రోడ్డు నెట్‌వర్క్ 4 రకాలుగా ఉంటాయి. అవి

జాతీయ హైవేలు, రోడ్లు బల్డింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే రోడ్డు, పంచాయత్‌రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే గ్రామీణ రోడ్లు, జీహెచ్‌ఎంసి నిర్వహించే రోడ్లు.

రోడ్డు నెట్‌వర్క్ ఇలా:

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రోడ్ల పొడవు 1,07,871 కి.మీ అనగా జాతీయ హైవేలు, రోడ్లు&బిల్డింగ్, పంచాయతీ రాజ్, జిహెచ్‌ఎంసీ శాఖలు నిర్వహించే రోడ్లు.

తెలంగాణ రాష్ట్రం గుండా 23 జాతీయ హైవేలు వెళుతున్నాయి. ఈ జాతీయ హైవేల మొత్తం పొడవు 3,910 కి.మీ.

రాష్ట్రంలోని మొత్తం జాతీయ హైవేలలో 5 జిల్లాల గుండా 31% జాతీయ హైవేలు వెళ్తున్నాయి. అవి నల్లగొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, ఖమ్మం.

అత్యధిక పొడవైన రోడ్డు నెట్‌వర్క్ గల తెలంగాణ జిల్లా నల్లగొండ జిల్లా.

జిల్లాల వారీగా అత్యధిక పొడవైన రోడ్డు నెట్‌వర్క్ గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ ఉన్నాయి.

జిల్లాల వారిగా అత్యల్ప పొడవైన రోడ్డు నెట్‌వర్క్‌గల చివరి నాలుగు జిల్లాలు వరుసగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హన్మకొండ ములుగు ఉన్నాయి.

202021 నాటికి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హైవే రోడ్డు మొత్తం పొడవు 3,910 కి.మీ.

జిల్లాల వారీగా అత్యధిక జాతీయ హైవేల రోడ్డు పొడవు గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి.

జిల్లాల వారీగా అత్యల్ప జాతీయ హైవేల రోడ్డు పొడవు గల చివరి నాలుగు జిల్లాలు పెద్దపల్లి, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల.

అత్యధికంగా ఆర్‌అండ్‌బి రోడ్డుగల జిల్లా ఖమ్మం.

అత్యల్పంగా ఆర్‌అండ్‌బి రోడ్డుగల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి.

ఆర్ అండ్ బి రోడ్డు లేని జిల్లా హైదరాబాద్.

అత్యధికంగా పంచాయతీ రాజ్ రోడ్డు గల జిల్లా నల్గొండ.

అత్యల్పంగా పంచాయతీరాజ్ రోడ్డుగల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి.

పంచాయతీరాజ్ రోడ్డు లేని జిల్లా హైదరాబాద్.

రోడ్డు సాంద్రత:

తెలంగాణ రాష్ట్ర సరాసరి రోడ్డు సాంద్రత 96.24 కి.మీ

జిల్లాల వారీగా అత్యధిక రోడ్డు సాంద్రత గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

జిల్లాల వారీగా అత్యల్ప రోడ్డు సాంద్రత గల చివరి నాలుగు జిల్లాలు వరుసగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్.

ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు:

ప్రతిపాదిత రీజనల్ రింగురోడ్డు, హైదరాబాద్ సిటీలో చుట్టూర ఉండబోతుంది.

భారత ప్రభుత్వం, సూత్రప్రాయంగా రెండు భాగాలుగా విడదీసింది.

ఉత్తర భాగం:

ఉత్తర రీజనల్ రింగ్‌రోడ్డు సంగారెడ్డి (161వ జాతీయ హైవే మీద) నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్, భువనగిరి, చౌటుప్పల్ (65వ జాతీయ హైవే మీద) మీదుగా వెళుతుంది.

దక్షిణ భాగం:

దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ (65వ జాతీయ రహదారి) షాద్‌నగర్, సంగారెడ్డి మీదుగా వెళుతుంది.

హైదరాబాద్ మెట్రో రైలు:

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 69 కి.మీ పొడవుతో సేవలు అందిస్తుంది.

కోవిడ్ లాక్‌డౌన్ కంటే ముందు ప్రతి రోజుకు మెట్రోరైలులో ప్రయాణించే ప్యాసింజర్లు దాదాపు 4 లక్షలు.

హైదరాబాద్ మెట్రో రైలు రెండో విడత డిటైల్స్ ప్రాజెక్టు రిపోర్టు స్టేజిలో ఉంది.

రెండో విడతలో 31 కి.మీ పొడవుతో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు రాయదుర్గం నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ వరకు రూ. 5,100 కోట్లతో అంచనా వేశారు.

మంగళపల్లి లాజిస్టిక్స్ పార్క్:

భారతదేశంలో తొలిసారిగా సమీకృత లాజిస్టిక్స్ పార్కును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పార్కు ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో 22 ఎకరాలలో విస్తరించి ఉంది.

బాట సింగారం లాజిస్టిక్స్ పార్కు:

మొదటి సారిగా ప్రభుత్వం వేర్ హౌసింగ్, పార్కింగ్ రిటైల్ సదుపాయంతో కూడిన లాజిస్టిక్స్ పార్కును బాట సింగారం లో ఏర్పాటు చేస్తుంది.

ఈ పార్కు 50 కోట్లు పెట్టుబడితో, దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతున్నాయి.

బాట సింగారం రంగారెడ్డి జిల్లాలో ఉంది. యదాద్రి భువనగిరి జిల్లాకు సరిహద్దులో ఉంటుంది.

మిషన్ భగీరథ:

జలశక్తి శాఖ భారత ప్రభుత్వం ప్రకారం తెలంగాణ రాష్ట్రం 100% గ్రామీణ ప్రాంతాల్లో నీటి కనెక్షన్లు కలిగి ఉంది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రతి కుటుంబానికి నీటి కనెక్షన్ కలిగి ఉన్న రాష్ట్రాలు గోవా, హర్యానా .. ఈ రాష్ట్రాలలో కూడా వంద శాతం ప్రతి కుటుంబానికి నల్లా నీరు కనెక్షన్ ఉంది.

భారతదేశంలో వంద శాతం ప్రతి కుటుంబానికి ట్యాప్ కనెక్షన్లు ఉన్న రాష్ట్రాలు..కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి. అవి

తెలంగాణ, గోవా, అండమాన్..నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నగర్..డామన్ డయ్యూ, హర్యానా.

మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి వంద ఎల్.పి .సి.డి, మున్సిపాలిటీల్లో 135 ఎల్.పి.సి.డి, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 ఎల్‌పిసిడి నీటిని ప్రభుత్వం అందజేస్తుంది. అదే విధంగా పరిశ్రమలు అవసరాల కోసం పది శాతం నీటిని అందజేస్తున్నారు.

స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్:

భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ను 2014లో ప్రారంభించింది.

2014లో తెలంగాణ రాష్ట్రంలో శానిటేషన్ కవరేజి 27.31శాతం మాత్రమే ఉండేది, కానీ 2019-20 నాటికి వంద శాతం శానిటేషన్ కవరేజిని సాధించింది.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రం 2019..ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ స్టేట్‌గా ప్రకటించబడింది.

-పుృథ్వీ కుమార్ చౌహాన్, పుృథ్వీస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్


Next Story

Most Viewed