పర్మిషన్ తీసుకుంటేనే పంపిస్తాం: యోగి

by  |
పర్మిషన్ తీసుకుంటేనే పంపిస్తాం: యోగి
X

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కార్మికులను తీసుకెళ్లాలని భావించే ఇతర రాష్ట్రాలు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ‘మా రాష్ట్రంలో నుంచి మ్యాన్ పవర్ కావాలని వేరే రాష్ట్రాలు భావిస్తే.. వారందరికీ ఇన్సూరెన్స్, సామాజిక భద్రతను కల్పిస్తాం. కానీ, ఆ రాష్ట్రాలు మా అనుమతి లేకుండా కూలీలను తీసుకెళ్లలేవు. ఎందుకంటే ఈ లాక్‌డౌన్ కాలంలో ఇతర రాష్ట్రాలు యూపీ ప్రజలపట్ల ఎలా వ్యవహరించాయో మాకు తెలుసు.’ అని ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో విలేకరులకు చెప్పారు. అంతేకాదు, వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కమిషన్ ద్వారా వలసలు వెళ్లే కూలీలకు తమ రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అయితే, వలస కూలీల కోసం అనుమతి ఎలా తీసుకోవాలో అనే విషయం స్పష్టతనివ్వలేదు. కాగా, ఇప్పటికే కర్ణాటకలాంటి రాష్ట్రాలు నిర్మాణ పనులు ప్రారంభమవ్వగానే తిరిగి వలస కార్మికులను వెనక్కి తీసుకువచ్చుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమిళనాడు మాత్రం ఇప్పుడు మిగిలి ఉన్న వలస కూలీలను రాష్ట్రానికే పరిమితం చేసుకుంది. యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకున్నా రాష్ట్రంలోనే కొన్ని వసతులు కల్పించుకుని నిలుపుకుంది.



Next Story

Most Viewed