SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.28తో రూ.4 లక్షల బెనిఫిట్..

by  |
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.28తో రూ.4 లక్షల బెనిఫిట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. ఇప్పుుడు ఎస్‌బీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చే సేవల్లో వున్నాయి. స్టేట్ బ్యాంక్ కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను కస్టమర్స్ కోసం ఉంచడం జరిగింది. అయితే స్కీమ్స్ లో రెండు స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. వీటిల్లో నెలకు రూ.28 చెల్లిస్తే.. ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY. అయితే ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది.

సురక్ష బీమా యోజన..

ఈ పథకం కింద కస్టమర్ ఏడాదికి రూ. 12 కట్టాలి. ఇలా కట్టడం ద్వారా కస్టమర్ అనేక లాభాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది.

జీవన్ జ్యోతి బీమా యోజన..

జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఎస్‌బీఐలో అకౌంట్ కలిగిన ప్రతీ ఒక్కరు ఈ బెనిఫిట్స్ పొందవచ్చును. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 కలిగి ఉండాలి. ఇక అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా ప్రీమియం డబ్బలు కట్ అవుతాయి.



Next Story