నా సక్సెస్‌లో 90 శాతం క్రెడిట్ ఆయనదే: గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
నా సక్సెస్‌లో 90 శాతం క్రెడిట్ ఆయనదే: గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన గిల్.. సీనియర్ బ్యాటర్లు విఫలమవుతోన్న చోట వరుస సెంచరీలు సాధిస్తూ.. భారత ఆశాకిరణంలా నిలుస్తున్నాడు. ఇటీవల భారత, కివీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతి చిన్న వయస్సులోనే టెస్ట్, వన్డే ఫార్మాట్లలో సెంచరీలు చేసిన శుభమన్.. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుతమైన సెంచరీ సాధించాడు.

తద్వారా భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లో సెంచరీలు చేసిన 5 ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. అంతేకాకుండా అతిచిన్న వయస్సులోనే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా సూపర్ ఫామ్‌తో అదరగొడుతోన్న గిల్ తన సక్సెస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నా సక్సెస్ క్రెడిట్ మా నాన్న, కెప్టెన్, టీమ్ మెనెజ్మెంట్‌కు దక్కుతుందని తెలిపాడు. నా సక్సెస్‌లో 90 శాతం క్రెడిట్ మా నాన్నకే దక్కుతుందని చెప్పాడు. తన ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానన్నాడు. అలాగే బుధవారం కివీస్‌తో జరిగిన చివరి టీ20లో కెప్టెన్ పాండ్యా చెప్పిన ట్రిక్ పని చేసిందని తెలిపాడు. న్యాచురల్ గేమ్ ఆడాలని పాండ్యా సూచించాడని.. తాను అలాగే ఆడానని పేర్కొన్నాడు. ఫలితంగా టీ20 కెరీర్‌లో తన మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.


Next Story

Most Viewed