తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే యువ క్రికెటర్ కన్నుమూత

by Disha Web Desk 19 |
తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే యువ క్రికెటర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. 20 ఏళ్లకే యువ క్రికెటర్ జోష్ బేక‌ర్ ఆకస్మికంగా మృతి చెందాడు. జోష్ బేక‌ర్ మరణవార్తను అత‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కౌంటీ జ‌ట్టు వోర్సెస్టర్‌షైర్ సోష‌ల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. వోర్సెస్టర్‌షైర్ తరుఫున బుధవారం వరకు క్రికెట్ ఆడిన బేకర్ హఠాన్మరణం చెందినట్లు తెలిపింది. యంగ్ ప్లేయర్ జోష్ బేకర్ మృతిపై వోర్సెస్టర్‌షైర్ జట్టు సంతాపం వ్యక్తం చేసింది. కాగా, లెఫ్టార్మ్ సిన్నర్ అయిన బేకర్.. 2021లో 17 ఏళ్ల వ‌య‌సులో ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్‌గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో మొత్తం 22 మ్యాచులు ఆడిన బేకర్ మొత్తం 43 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ బేకర్ ఆకస్మికంగా మృతి చెందడంతో సహచరులు సంతాపం తెలిపారు. అయితే, బేకర్ మరణవార్తను దృవీకరించిన వోర్సెస్టర్‌షైర్ జట్టు.. అతడికి మృతికి గల కారణాలు ఏంటన్న వెల్లడించలేదు. దీంతో బేకర్ మృతికి కారణమేంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed