WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతనే కీలకం : సునీల్ గవాస్కర్

by Disha Web Desk 13 |
WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతనే కీలకం : సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు అందరి ఫోకస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై మీదకు మళ్లింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్లేయర్స్ తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా కూడా భారత జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కీలక ప్లేయర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్న క్రమంలో.. టీమ్ ఇండియా జట్టుపై భారత మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కీలక కామెంట్స్ చేశాడు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఛటేశ్వర్ పుజారా చాలా కీలకం కానున్నాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పుజారా కౌంటీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టీం తరఫున ఆరు మ్యాచుల్లో 68.12 సగటుతో 545 పరుగులు చేశాడు. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ వంటి స్టార్లు ఉన్న జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు పూజారా.

ఇదే విషయాన్ని గుర్తుచేశాడు సునీల్ గవాస్కర్.. "అక్కడ కొంత కాలంగా పుజారా ఉండటం వల్ల ఓవల్ పిచ్ ఎలా ఉంటుందో కూడా అతనికి ఒక ఐడియా ఉంటుంది. ఆ పిచ్‌పై ఆడి ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాటింగ్ యూనిట్‌కు అతను ఇచ్చే ఇన్‌పుట్స్ చాలా కీలకంగా ఉంటాయి. కెప్టెన్‌కు కూడా పుజారా ఇచ్చే సలహాలు కీలకంగా మారతాయి" అని గవాస్కర్ అన్నాడు. "ఓవల్ పిచ్ విషయంలో పుజారా సూచనలు కెప్టెన్‌కు కూడా చాలా ఉపయోగపడతాయి. అతను కూడా కౌంటీల్లో కెప్టెన్సీ చేస్తున్నాడని మర్చిపోకూడదు. అతని టీంలోనే స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. కాబట్టి అతన్ని ఎలా ఔట్ చేయాలని కొన్ని స్ట్రాటజీలు వేసే ఉంటాడు" అని అభిప్రాయపడ్డాడు. పూజారా ఆసీస్‌పై 24 టెస్టులు ఆడగా.. 50.82 సగటుతో 2 వేలకు పైగా రన్స్ చేశాడు.



Next Story

Most Viewed