రెజ్లింగ్ అడ్ హక్ కమిటీ రద్దు

by Dishanational3 |
రెజ్లింగ్ అడ్ హక్ కమిటీ రద్దు
X

దిశ, స్పోర్ట్స్ : భారత రెజ్లింగ్ రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన అడ్ హక్ కమిటీని సోమవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) రద్దు చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన నిషేధాన్ని గత నెలలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిషేధాన్ని ఎత్తివేయడం, పారిస్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐవోఏ తెలిపింది. భారత రెజ్లింగ్ సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలను అడ్ హక్ కమిటీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఐవోఏ నిర్ణయంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది. గతేడాది డిసెంబర్‌లో సంజయ్ సింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంతో క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్‌ఐ పాలకవర్గంపై నిషేధం విధించింది.

Next Story

Most Viewed