- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఫైనల్‌కు హితేశ్.. తొలి భారత బాక్సర్‌గా రికార్డు
బ్రెజిల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : బ్రెజిల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. 70 కేజీల కేటగిరీలో విజేతగా నిలవడానికి అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం హితేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఫ్రాన్స్‌కు చెందిన బాక్సర్ మకాన్ త్రోరేపై 5-0 తేడాతో విజయం సాధించాడు. దీంతో వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. సెమీస్‌లో హితేశ్ ప్రత్యర్థిపై వ్యూహాత్మకంగా దాడి చేశాడు. జాగ్రత్తగా ఆడుతూనే ఎటాకింగ్‌కు దిగి ఫలితం సాధించాడు. ఫైనల్‌లో ఇంగ్లాండ్ బాక్సర్ ఒడెల్ కమారాతో హితేశ్ తలపడనున్నాడు. భారత ఇతర బాక్సర్లు జదుమణి, విశాల్, సచిన్ సెమీస్‌ల్లో ఓడిపోయారు. 50 కేజీల కేటగిరీలో జదుమణి 2-3 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అసిల్‌బెక్ జలిలోవ్ చేతిలో పోరాడి ఓడాడు. 90 కేజీల కేటగిరీలో విశాల్ 0-5 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కే చెందిన తురాబెక్ ఖబిబుల్లేవ్ చేతిలో ఓడగా.. పావెల్ బ్రాచ్(పొలాండ్) చేతిలో సచిన్ పరాయం చవిచూశాడు.






