వైడ్, నోబాల్‌కు ఇక రివ్యూ తీసుకోవచ్చు: బీసీసీఐ నయా రూల్

by Disha Web Desk 1 |
వైడ్, నోబాల్‌కు ఇక రివ్యూ తీసుకోవచ్చు: బీసీసీఐ నయా రూల్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధనను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆటగాళ్లు రివ్యూ తీసుకనే అవకాశం కల్పించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ నిబంధనను బీసీసీఐ ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్‌లోనూ ప్రవేశ పెట్టింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో ఈ నిబంధనను ఉపయోగించుకొని ఆయా జట్లు లబ్ధి పొందాయి. యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూపీ ప్లేయర్ గ్రేస్ హారీస్ వైడ్ బాల్ కోసం రివ్యూ కోరి ఎక్స్‌ట్రా పరుగు సాధించింది.

మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో యూపీ వారియర్స్ విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో గ్రేస్ హారీస్ వాడిన డీఆర్‌ఎస్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అలాగే ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీసీ ప్లేయర్ నోబాల్ కోసం డీఆర్‌ఎస్ రివ్యూ కోరింది. ఇప్పుడు ఇదే నిబంధనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లోనూ అమలు చేయాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే, లెగ్ బైస్‌గా ప్రకటించిన పరుగుల విషయంలో మాత్రం రివ్యూ తీసుకునే అవకాశం లేదు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చేస్తోంది..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అప్‌కమింగ్ సీజన్‌లో అమలు చేయనుంది. ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌గా ఆడించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండటమే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉద్దేశం.

మ్యాచ్ జరుగుతుండగా ఫోర్త్ అంపైర్ లేదా ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడంతో పాటు నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. ఇప్పటికే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను ప్రయోగత్మకంగా బీసీసీఐ అమలు చేసింది.

Next Story

Most Viewed