కెప్టెన్ అని చెప్పి.. జట్టు నుంచి తప్పించారు: వీరేంద్ర సెహ్వాగ్

by Disha Web Desk 17 |
కెప్టెన్ అని చెప్పి.. జట్టు నుంచి తప్పించారు: వీరేంద్ర సెహ్వాగ్
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 2005లో కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత అప్పటి ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు జట్టు పగ్గాలు అప్పగిస్తారని చాలా మంది భావించారు. అయితే, సెహ్వాగ్‌ను కాదని రాహుల్ ద్రవిడ్‌‌ను కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్సీపై తాజా ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అప్పటి హెడ్ కోచ్ గ్రేగ్ చాపెల్ టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ నేనే అని చెప్పారు. కానీ, రెండు నెలలకే తనను జట్టు నుంచి తీసేశారు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు’ అని సెహ్వాగ్ తెలిపాడు.

టీమ్ ఇండియాకు విదేశీ కోచ్‌లను నియమించడం తనకు నచ్చేది కాదని, అప్పట్లో ఈ విషయాన్ని సీనియర్ల దృష్టికి కూడా తీసుకెళ్లేవాడినని చెప్పాడు. కాగా, ద్రవిడ్ తర్వాత జట్టు పగ్గాలను ధోనీ అందుకోగా.. సెహ్వాగ్ డిప్యూటీ గా వ్యవహరించాడు. అయితే, తన కెరీర్‌లో14 మ్యాచ్‌ల్లో తాత్కాలిక కెప్టెన్‌గా సెహ్వాగ్ జట్టును నడిపించినప్పటికీ.. శాశ్వత సారథ్య బాధ్యతలను మాత్రం చేపట్టలేకపోయాడు.

Next Story