మేనకా గాంధీకి రూ.97కోట్ల ఆస్తులు.. ఐదేళ్లలో దాదాపు రెట్టింపైన సంపద

by Swamyn |
మేనకా గాంధీకి రూ.97కోట్ల ఆస్తులు.. ఐదేళ్లలో దాదాపు రెట్టింపైన సంపద
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేత, ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన మేనకా సంజయ్ గాంధీ ఆస్తులు ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆమె యూపీలోని తన సిట్టింగ్ స్థానమైన సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.97.17కోట్లుగా ప్రకటించారు. అఫిడవిట్ ప్రకారం, 2019లో ఆమె మొత్తం ఆస్తి విలువ రూ.55.69కోట్లుగా ఉండగా, ఐదేళ్లు తిరిగేసరికి 43శాతం పెరిగి రూ.97.17 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.51.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా, చరాస్తుల విలువ రూ.45.97 కోట్లుగా ఉంది.

బ్యాంక్, ఇతర ఆదాయాలు

గత ఎన్నికల అఫిడవిట్ సమయంలో మేనకా గాంధీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.18.47 కోట్లు ఉండగా, ఈసారి రూ.17.83 కోట్లకు తగ్గింది. అయితే, డిబెంచర్లు, షేర్లు, బాండ్ల ద్వారా ఆమె సంపాదన 2019లో రూ.5.55 కోట్ల నుంచి రూ.24.30కోట్లకు పెరిగడం గమనార్హం. పోస్టాఫీసు పొదుపులు కూడా 2019లో రూ.43.32 లక్షలు ఉండగా, ఇప్పటివరకు అవి రూ.81.01 లక్షలకు పెరిగాయి. అలాగే, మేనక వద్ద రూ.2.82 కోట్ల విలువైన 3.415 కిలోల బంగారం, 85కిలోల వెండి ఉంది. వీటితోపాటు రూ.40వేల విలువ చేసే ఓ తుపాకీ సైతం ఉంది.


Advertisement

Next Story

Most Viewed