ఆ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు కోహ్లీ స్పెషల్ ప్రాక్టీస్

by Dishanational5 |
ఆ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు కోహ్లీ స్పెషల్ ప్రాక్టీస్
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా చేతిలో తొలి టెస్టు కోల్పోయిన టీమ్ ఇండియా.. రేపటి నుంచి కేప్‌టౌన్ వేదికగా జరిగే రెండో టెస్టులో సత్తాచాటాలనుకుంటుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు సోమవారం ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రాణించాడు. 82 బంతుల్లో 76 పరుగులతో కీలక పోరాటం చేశాడు. మరో ఎండ్‌లో వరుస వికెట్లు పడుతూ.. సహకారం కరువైన పరిస్థితుల్లో విరాట్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టెస్టులోనూ కేప్‌టౌన్ పిచ్‌పై అదే తరహా ప్రదర్శనను కొనసాగించాలనే ఉద్దేశంతో కోహ్లీ నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. మొత్తం ప్రాక్టీస్ సెషన్‌లో అతను గంట సేపు బ్యాటింగ్ చేశాడు. ఈ సెషన్‌లో అతను బౌలర్లతోపాటు త్రోడౌన్‌లను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా, సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నాండ్రే బర్గర్‌ను ఎదుర్కోవడానికి కోహ్లీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. తొలి టెస్టులో బర్గర్ 7 వికెట్లు తీసుకున్నాడు. భారత బృందంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడు. దీంతో సౌతాఫ్రికాకు చెందిన నెట్ బౌలర్‌తో కోహ్లీ సాధన చేశాడు. అలాగే, భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌ బౌలింగ్‌లోనూ బ్యాటింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌లు ప్రాక్టీస్ చేసిన అతను.. అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. ఈ నెల 3 నుంచి 7వ తేదీల మధ్య రెండో టెస్టు జరగనుంది.

Read More..

ఉస్మాన్ ఖవాజా రిక్వెస్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమోదం

Next Story