నేడు 2007, 2011 వరల్డ్ కప్ విన్నర్ గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు

by Disha Web Desk 12 |
నేడు 2007, 2011 వరల్డ్ కప్ విన్నర్ గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు భారత మాజీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ.. గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కోన్ని కీలక విషయాలు తెలుసుకుందాం. గంభీర్ 1981 అక్టోబర్ 14 న ఢిల్లీ లో జన్మించారు. 2003 నుంచి వన్డేలలో, 2004 నుంచి టెస్టుల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలను సాధించి భారత టెస్ట్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండుల్కర్ తర్వాత స్వదేశంలో జరిగిన టూర్ గేమ్‌లో డబుల్ సెంచరీ సాధించిన 4వ భారతీయుడిగా గంభీర్ నిలిచాడు. ఆ తర్వాత భారత జట్టులో మిస్టర్ ఫైర్ బ్యాటర్ గా నిలిచాడు. ముఖ్యంగా ముక్కు మీద కోపం తో ప్రత్యర్థి జట్టుపై గంభీర్ నిప్పులు చెరిగే వాడు.

అందులోను పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే గంభీర్ ఓ రేంజ్ ఫైర్ అయ్యేవాడు. వీరేంద్ర సెహ్వాగ్ కు ఓపెనర్ జోడిగా భారత క్రికెట్ కు రికార్డులు అందిచారు. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ విజయంలో గంభీర్ తనదైన పాత్రను పోషించాడు. అలాగే ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా.. 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలోనే ఛాంపియన్ గా నిలిచింది. అనంతరం.. 2018 డిసెంబర్ 14న అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. అదే సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 3,90,391 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. అలాగే ప్రస్తుతం ఆయన కామెంటేటర్‌గా, అలాగే KKR జట్టుకు అధికారిక మెంటర్‌గా కొనసాగుతున్నాడు.



Next Story

Most Viewed