నాలుగో టెస్ట్ కు ప్రధానుల రాక.. ఆయోమయంలో క్రీడాభిమానులు

by Disha Web Desk 1 |
నాలుగో టెస్ట్ కు ప్రధానుల రాక.. ఆయోమయంలో క్రీడాభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి పరాజయాన్ని చవిచూసిన టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్ట్‌కు ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. భారత ప్రధాన నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అయితే, ఇరుదేశాల ప్రధానుల రాకతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులకు ఊహించని షాకిచ్చింది.

ప్రధానుల రాక నేపథ్యంలో తొలి రోజుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ లో బ్లాక్ చేసింది. భద్రతా సమస్యలు తలెత్తకుండా తొలి రోజు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) తొలి రోజుకు సంబంధించిన టికెట్లను బ్లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జీసీఏ ఇప్పటి వరకు అధికారిక ప్రకట చేయలేదు.

బుక్‌ మై షో మాత్రం తొలి రోజుకు సంబంధించిన టికెట్లు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవంటూ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడడం ఆటగాళ్లకు కూడా కష్టంగా ఉంటుందని, తొలి రోజు టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యవహారంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మౌనం పాటిస్తోంది.

Next Story

Most Viewed