తెలంగాణ క్రీడా విజయాలు దేశానికి ఆదర్శం.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

by Dishafeatures2 |
తెలంగాణ క్రీడా విజయాలు దేశానికి ఆదర్శం.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది కాలంలో ప్రణాళిక బద్ధంగా అనుసరించిన విధానాల ఫలితాలే ఇప్పుడు విజయాలు అని, తెలంగాణ క్రీడా విజయాలు దేశానికే ఆదర్శం అని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతో అన్ని రంగాలతో పాటు క్రీడారంగం కూడా అంచలంచలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎల్బీ స్టేడియంలోని సాట్స్ కార్యాలయంలో మంగళవారం గోవాలో ఇటీవల జరిగిన 5వ ఫెడరేషన్ బాండీ టోర్నమెంట్ లో ఐస్ స్కేటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించిన బాల,బాలికల జట్లను అభినందించారు.

క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, మైదానాల అభివృద్ధి, క్రీడా పోటీల నిర్వహణ, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, క్రీడా సామాగ్రి పంపిణీ తదితర బహుముఖ వ్యూహంతో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బాండీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నసీరుద్దీన్ , టెన్నిస్ కోచ్ సాయి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed