- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై ప్లేయర్ పై మోజు...స్టేడియంలో అందాల తార రచ్చ !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK )

దిశ , వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్... వరుసగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా రోహిత్ శర్మ ( Rohit Sharma) అద్భుతంగా ఆడి... జట్టును విజయతీరాలకు చేర్చాడు. 45 బంతుల్లోనే 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆరు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కొట్టాడు.
ఇదంతా పక్కకు పెడితే... ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎక్కడ ఆడిన.. ఓ అందాల తార అక్కడ ప్రత్యక్షమవుతోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ (Sonal Chauhan). తెలుగు అలాగే హిందీ సినిమాలు ఎన్నో చేసిన ఈ బ్యూటీ... ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నమెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు రోహిత్ శర్మ ఇష్టమని ఇటీవల ప్రకటించిన సోనాల్ చౌహన్... అతని బ్యాటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్తానని ప్రకటించింది.
దానికి తగ్గట్టుగానే... ఆమె వెళ్లిన గత రెండు మ్యాచ్ లలో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పై గెలిచిన ముంబై ఇండియన్స్... నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది. దీంతో ముంబై ఆడిన ప్రతి మ్యాచ్ ను సోనాల్ చౌహన్ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అప్పుడే రోహిత్ శర్మ కూడా రెచ్చిపోయి ఆడతాడని.. కామెంట్స్ పెడుతున్నారు.






