- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
పృథ్వీ షాకు అవకాశమివ్వండి: పాక్ మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు కీలక మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. తొలి టీ20లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు.. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో ఒక బంతి మిగిలుండగానే విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టి పృథ్వీ షాకు అవకాశమివ్వాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా భారత జట్టుకు సూచించారు.
'ఈ సిరీస్‌లో ఇది చివరి మ్యాచ్. ఇప్పటి వరకు గిల్ ఎలా ఆడాడో చూశాం. పృథ్వీ షా ఉత్సాహవంతులైన యువ క్రికెటర్. అతనికి తన అటాకింగ్ గేమ్ గురించి తెలుసు. గిల్ స్థానంలో షాకు అవకాశమివ్వండి. షాలో చాలా నైపుణ్యం ఉంది. అతను నిలకడగా రాణిస్తే అద్భుతాలు చేయగలడు. శుభ్‌మన్ గిల్ గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ అతను తన బ్యాటింగ్‌లోని లోపాలను సరిచేసుకోవాలి. ముఖ్యంగా స్పిన్ బౌలర్లతో బాగా ప్రాక్టీస్ చేయాలి' అని కనేరియా చెప్పారు. గిల్ తన టి20 కెరీర్‌లో 76 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.