కుర్రాడిని ముగ్గులోకి దించే ఉద్యోగం.. యువతలో చెమటలు పట్టిస్తోన్న బెస్ట్ రొమాంటిక్ చిత్రం! ఒంటరిగా చూడండి

by Disha Web Desk 9 |
కుర్రాడిని ముగ్గులోకి దించే ఉద్యోగం.. యువతలో చెమటలు పట్టిస్తోన్న బెస్ట్ రొమాంటిక్ చిత్రం! ఒంటరిగా చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్షన్, డ్రామా, కామెడీ, సస్పెన్స్, హార్రర్ ఇలా ఒక్కో జానర్‌కు సంబంధించిన సినిమాలు ఓటీటీలో వచ్చినప్పటికీ రొమాంటిక్ చిత్రాలే యువతను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఓ బెస్ట్ రొమాంటిక్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. మనదేశంలో పిల్లల పెంపకానికి విదేశాల్లో పిల్లల పెంపకానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సంస్కృతి వేరు. కానీ విదేశాల్లో వారి జీవన విధానం, పిల్లల పెంపకం పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ 18 సంవత్సరాలు దాటిన అనంతరం వారి లైఫ్ వారే లీడ్ చేయాల్సి ఉంటుంది. నలుగురితో కలిసిమెలసి ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి? సమాజం అంటే ఏంటో తెలుసుకోవాలి? ఇవే విషయాలు ఈ చిత్రంలో చూపిస్తారు. అయితే ఈ చిత్రంలో ఓ యువకుడికి సమాజం గురించి మొత్తమే అవగాహన ఉండదు. అమ్మాయిలంటే చాలా సిగ్గు. డేటింగ్‌కు వెళ్లడు. అసలు రూంలో నుంచి బయటికే వెళ్లడు. కాగా ఇతడ్ని మార్చాలని హీరోయిన్ అనుకుంటుంది. జనాల్లో బతికేలా చేయాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం ఒక డిఫరెంట్ ఆఫర్ చేస్తారు.

తమ పిల్లాడిని డేటింగ్ చేస్తే కారు వాడుకునేందుకు వెసులుబాటు ఇస్తామని చెప్పారు. మరోవైపు హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ వద్ద ఉన్న కారును తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తీసేసుకుంటాడు. ఆమె నచ్చిన వాళ్లతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఉద్యోగం కోసం కారు తప్పకుండా కావాలి. అందుకే ఆ కుర్రాడని డేటింగ్ చేసే ఉద్యోగానికి ఓకే చెబుతుంది. అతడికి అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుంది? నలుగురితో ఎలా మెలగాలి. ముఖ్యంగా అమ్మాయిలతో ఎలా ఉండాలి అనే విషయాలను నేర్పిస్తుంది. ఈ క్రమంలో చాలానే ఘాటు సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉంటాయి. సినిమా మొత్తం రొమాంటిక్‌గా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూస్తే బెటర్. ఈ చిత్రం పేరే ‘నో హార్డ్ ఫీలింగ్స్’. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Next Story