చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. టీ20ల్లో ఏకైక క్రికెటర్‌గా..

by Dishanational3 |
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. టీ20ల్లో ఏకైక క్రికెటర్‌గా..
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌లో నయా రికార్డును సృష్టించాడు. పురుషుల పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హిట్‌మ్యాన్ తాజాగా 150 మ్యాచ్ ఆడి వరల్డ్ రికార్డు సెట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో బరిలోకి దిగడంతో అతను ఈ ఘనత సాధించాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా దిగ్గజం అల్లాన్ బోర్డర్ తొలిసారిగా ఈ ఫీట్ సాధించగా.. టీ20ల్లో రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 141 ఇన్నింగ్స్‌ల్లో 30.58 సగటుతో 3,853 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రోహిత్ తర్వాత ఐర్లాండ్‌ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్(134) రెండో స్థానంలో ఉన్నాడు. మరో ఐర్లాండ్ ప్లేయర్ జార్జ్ డాక్రెల్(128), పాక్‌కు చెందిన షోయబ్ మాలిక్(124), న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్(122) టాప్-5లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 116 మ్యాచ్‌లతో 10వ స్థానంలో ఉన్నాడు. మొత్తంగా టీ20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 161 మ్యాచ్‌లతో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కొనసాగుతోంది.



Next Story

Most Viewed