- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రాకు కెప్టెన్సీ వద్దు.. వాళ్లిద్దరే ముద్దు: రవిశాస్త్రి
బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని రవిశాస్త్రి అన్నాడు. అతను ఇద్దరి పేర్లు సూచించాడు.

దిశ, స్పోర్ట్స్: టెస్టులకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో అతని వారసుడిగా సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించేది ఎవరనే ప్రశ్న తలెత్తింది. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నా.. జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ రేసులో ముందంజలోనే ఉన్నాడు. అయితే బుమ్రాను టెస్టు కెప్టెన్ చెయ్యడం సరైన నిర్ణయం కాదని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా బుమ్రానే కెప్టెన్ చెయ్యాలి. కానీ నాకు అది ఇష్టం లేదు. తన శరీరంపై ఎక్కువ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
‘బుమ్రా వెన్నుగాయం నుంచి కోలుకొని ఇప్పుడే మళ్లీ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను వేసేది మ్యాచ్‌కు 4 ఓవర్లే అని మర్చిపోకూడదు. ఇప్పుడు టెస్టుల్లో 10-15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కెప్టెన్సీ ఒత్తిడి కూడా అతనిపై పెట్టడం కరెక్ట్ కాదు’ అని రవిశాస్త్రి కరాఖండీగా చెప్పేశాడు. అదే సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శుభ్‌మన్ గిల్ లేదా రిషభ్ పంత్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలన్నాడీ లెజెండరీ ఆల్‌రౌండర్. వీళ్లిద్దరూ కనీసం ఇంకో పదేళ్లు ఆడతారని, ఇద్దరిలోనూ నాయకత్వ లక్షణాలున్నాయని చెప్పాడు.






