Rishabh Pant car accident: త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా PM Modi

by Satheesh |   (  Updated:2022-12-30 12:13:44  IST  )

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇవాళ ఉయదం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Rishabh Pant car accident: త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా PM Modi
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇవాళ ఉయదం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇంటికి వెళ్తుండగా పంత్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజూమున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తృటిలో ప్రాణపాయం నుండి బయటపడ్డ పంత్‌కు తలకు, కాళ్లకు, వీపుకు తీవ్ర గాయాలు కావడంతో డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, పంత్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా సానుభూతి తెలిపారు. ''క్రికెటర్ రిషబ్ పంత్‌కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసి బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని.. పంత్ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను'' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Next Story