ఆసియా కప్‌‌లో పాక్ ఫస్ట్ విక్టరీ.. ఒమన్‌పై 93 పరుగుల తేడాతో విజయం

by Phanindra |

ఆసియా కప్‌‌లో పాక్ ఫస్ట్ విక్టరీ సాధించింది. ఒమన్‌ను ఏకంగా 93 పరుగుల తేడాతో చిత్తుచేసింది.

ఆసియా కప్‌‌లో పాక్ ఫస్ట్ విక్టరీ.. ఒమన్‌పై 93 పరుగుల తేడాతో విజయం
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై పాకిస్తాన్ జయభేరి మోగించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సైమా ఆయుబ్ (0) విఫలమైనా.. షాహిబ్జాదా ఫర్హాన్ (29), మహమ్మద్ హారిస్ (66) ఆ జట్టును ఆదుకున్నారు. ఫఖర్ జమాన్ (23), మహమ్మద్ నవాజ్ (19) కూడా ఫర్వాలేదనిపించారు. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, ఆమిర్ కలీమ్ చెరో మూడు వికెట్లతో రాణించారు.

అనంతరం ఛేజింగ్‌లో ఒమన్ దారుణమైన ప్రదర్శన చేసింది. ఆమిర్ కలీమ్ (13), హమ్మద్ మిర్జా (27), షకీల్ అహ్మద్ (10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ టీం 16.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లు అందరూ వికెట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం. సైమ్ ఆయుబ్, సుఫియాన్ ముకీమ్, ఫహీం అష్రాఫ్ తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం నాడు భారత్‌తో తలపడనుంది.

Next Story