మహిళా కోచ్‌పై లైంగిక ఆరోపణలు.. తన బట్టలు తొలగించడానికి ప్రయత్నించిందని మైనర్ బాక్సర్ ఫిర్యాదు

by Harish |

సాయ్ నేషనల్ బాక్సింగ్ అకాడమీకి చెందిన మహిళా కోచ్‌పై జాతీయ స్థాయి మైనర్ బాక్సర్ లైంగిక ఆరోపణలు చేసింది.

మహిళా కోచ్‌పై లైంగిక ఆరోపణలు.. తన బట్టలు తొలగించడానికి ప్రయత్నించిందని మైనర్ బాక్సర్ ఫిర్యాదు
X

దిశ, స్పోర్ట్స్ : రోహ్‌తక్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నేషనల్ బాక్సింగ్ అకాడమీకి చెందిన మహిళా కోచ్‌పై జాతీయ స్థాయి మైనర్ బాక్సర్ లైంగిక ఆరోపణలు చేసింది. 17 ఏళ్ల బాధితురాలు సదరు కోచ్‌పై రోహ్‌తక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోచ్ ఓ సారి తన దుస్తులను బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించిందని, చాలాసార్లు తనను చెంపదెబ్బ కొట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, తన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించిందని, ఇతర బాక్సర్ల ముందు తాను చెడ్డ స్వభావం గల వ్యక్తి అని పిలిచిందని ఆరోపించింది.

నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించడం వల్ల తమ కూతురు డిప్రెషన్‌లోకి వెళ్లిందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. బాక్సర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కోచ్‌పై సెక్షన్ 115, 351(3)లతోపాటు లైంగిక వేధింపుల చట్టంలోని సెక్షన్ 10 కింద ఎఫ్‌ఐర్ నమోదు చేశారు. దీనిపై సాయ్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించాయి. ఐర్లాండ్‌లో జరిగిన ఇన్విటేషనల్ బాక్సింగ్ టోర్నీలో మహిళా కోచ్ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసిందని ఓ మహిళా బాక్సర్ ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిందని తెలిపాయి. అయితే ఆ ఫిర్యాదులో లైంగిక వేధింపులకు గురించి చెప్పలేదని పేర్కొన్నాయి. తమ అంతర్గత విచారణలో కోచ్‌గా వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపాయి.


Next Story