జావెలిన్ త్రోయర్ శివపాల్‌పై నాలుగేళ్ల నిషేధం

by Disha Web Desk 13 |
జావెలిన్ త్రోయర్ శివపాల్‌పై నాలుగేళ్ల నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: డోప్ టెస్టులో దొరికిపోవడంతో సస్సెన్షన్‌లో ఉన్నా.. భారత జావెలిన్ థ్రోయర్ శివపాల్ సింగ్‌పై వేటు పడింది. డోప్ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో నాలుగేళ్ల పాటు ఆట నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. నేషనల్ డోపింగ్ ఏజెన్సీ కి చెందిన క్రమశిక్షణా సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌కి చెందిన 27 ఏళ్ల శివపాల్ సింగ్‌ టోక్యో ఒపింపిక్స్‌లో పాల్గొన్నాడు. డోప్ టెస్టులో దొరికిపోవడంతో ప్రస్తుతం నాలుగేళ్ల పాటు ఆటకు దూరం కానున్నాడు. 2025 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అక్టోబర్ 21, 2021 నుంచి 2025 అక్టోబర్ చివరి వరకు నిషేధం అమలులో ఉండనుంది. 2019లో శివపాల్ సింగ్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ ఏడాదిలో NADA నిషేధానికి గురైన ఐదవ ప్లేయర్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపియన్ కమల్‌ప్రీత్ కౌర్, ఎంఆర్‌ పూవమ్మ, స్పింటర్ ధనలక్ష్మీ శేఖర్, డిస్కస్ త్రోవర్ నవజీత్ కౌర్ ధిల్లన్‌లు డోపింగ్ కోడ్ ఉల్లంఘనల కారణంగా ఆటకు దూరమయ్యారు.


Next Story

Most Viewed