- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌కు ముందు ముంబైకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్
ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెల ఆఖర్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌పూర్ దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా అతను సీజన్ నుంచి తప్పుకున్నాడని ఐపీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వేలంలో ఘజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ రూ.4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతను దూరం కావడంతో ముంబై అఫ్గాన్‌కే చెందిన మరో స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంది. స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను ఘజన్‌ఫర్ స్థానంలో భర్తీ చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ముజీబ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ముంబై రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కే ముజీబ్‌తో ఒప్పందం చేసుకుంది. ముజీబ్‌కు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. 19 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అయితే, ముజీబ్ గత మూడు సీజన్లు ఆడలేదు. చివరిసారిగా 2021 సీజన్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.






