Lionel Messi: మెస్సీ సచిన్ సేమ్ టు సేమ్

by Disha Web Desk 4 |
Lionel Messi: మెస్సీ సచిన్ సేమ్ టు సేమ్
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు మెస్సీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ విజయాల్లో కొన్ని ఘటనలు పోలి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రికెట్లో సచిన్ జెర్సీనంబర్ 10 కాగా మెస్సీ జెర్సీ నంబర్ 10 కావడం విశేషం. 2003లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుతో ఓటమి తర్వాత తీవ్ర నిరాశ చెందిన సచిన్ ఆ కలను 2011లో సాకారం చేసుకున్నాడు. 2014లో ఫైనల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెస్సీ ఎనిమిదేళ్లకు ఇప్పుడు ప్రపంచకప్ అందుకున్నాడు. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాగా 2022 ప్రపంచకప్‌లోనూ మెస్సీ సెమీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వేర్వేరు క్రీడల్లో విశేష ఆదరణ కలిగిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల జీవితంలో ఇలా కీలక విషయాలు మ్యాచ్ కావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. కాగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. ఫ్రాన్స్‌పై షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.



Next Story

Most Viewed