నేను చేసింది కరెక్ట్ కాదు.. ఆ ఘటన నాకు నచ్చలేదు : మెస్సీ

by Disha Web Desk 7 |
నేను చేసింది కరెక్ట్ కాదు.. ఆ ఘటన నాకు నచ్చలేదు : మెస్సీ
X

పారిస్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రవర్తనపై పశ్చాత్తాపపడ్డాడు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఆ మ్యాచ్‌లో పెనాల్టీ గోల్ వేసిన సందర్భంలో ప్రత్యర్థి నెదర్లాండ్స్ జట్టు మేనేజర్‌, కోచ్ లూయిస్ వాన్ గాల్‌ వద్దకు పోయి ఎగతాళి చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ అనుచిత ప్రవర్తనకు మెస్సీ అతని జట్టు సభ్యులు తీవ్ర విమర్శలకు లోనయ్యారు. ఆ మ్యాచ్ నిర్ణీత సమయంలో 2-2తో డ్రా అయింది. కానీ పెనాల్టీ స్ట్రోక్స్‌లో అర్జెంటీనా గెలిచింది.

73వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేసిన సమయంలో మెస్సీ నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ వద్దకు పోయి తన రెండు చేతులను చెవులపై కప్పి ఎగతాలి చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ అర్జెంటీనా జట్టుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మెస్సీ చెప్పాడు. 'మీడియా సమావేశంలో వాన్ గాల్ ఏం చెప్పాడో నాకు తెలుసు. కానీ గోల్ చేసినప్పుడు అనుకోకుండా జరిగిన సంఘటన అది. ఏది ఏమైనా నేను చేసింది కరెక్ట్ కాదు. ఆ సంఘటన నాకు నచ్చలేదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి' అని ఓ ఇంటర్వ్యూలో మెస్సీ పేర్కొన్నాడు.



Next Story

Most Viewed