రికార్డుల కింగ్.. ఈ గ్రౌండ్లలో మాత్రం జీరో!

by Disha Web Desk 1 |
రికార్డుల కింగ్.. ఈ గ్రౌండ్లలో మాత్రం జీరో!
X

దిశ, వెబ్ డెస్క్: ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్నా.. కోహ్లీ స్వదేశంలో చాలా టెస్ట్‌ సెంచరీలు చేశాడు. కానీ స్వదేశంలోని కొన్ని ప్రముఖ క్రికెట్ గ్రౌండ్స్‌లో మాత్రం అతను టెస్ట్‌ల్లో సెంచరీలు చేయలేకపోయాడు. కనీసం రెండు టెస్ట్‌లు ఆడి కూడా కోహ్లి సెంచరీలు సాధించలేకపోయిన ఇండియన్‌ గ్రౌండ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్. ఇందుకు తన కెరీర్‌లో విరాట్‌ చేసిన పరుగులే నిదర్శనం. కెరీర్‌ ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే విరాట్‌ చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి 106 టెస్టుల్లో 48.49 సగటుతో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలతో మొత్తం 8,195 పరుగులు చేశాడు.

కేవలం 549 ఇన్నింగ్స్‌లలో అత్యంత వేగంగా 25,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. దశాబ్దానికి పైగా క్రికెట్‌లో కొనసాగుతున్న కోహ్లీ స్వదేశంలో చాలా టెస్ట్‌ సెంచరీలు చేశాడు. కానీ భారతదేశంలోని కొన్ని ఐకానిక్ క్రికెట్ గ్రౌండ్స్‌లో అతను టెస్ట్‌లలో వంద కొట్టలేకపోయాడు. కనీసం రెండు టెస్ట్‌లు ఆడి కూడా కోహ్లి సెంచరీలు సాధించలేకపోయిన ఇండియన్‌ గ్రౌండ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.

మొదటిది నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా, అహ్మదాబాద్) ఇండియాలోనే ఇది అత్యాధునికి, అతిపెద్ద స్టేడియాన్ని ఇటీవలే కొత్తగా నిర్మించారు. ఇందులో 100,000 మందికి పైగా కూర్చుని క్రికెట్‌ను వీక్షించవచ్చు. 2021 ఫిబ్రవరిలో పునర్నిర్మాణం తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. విరాట్ ఈ గ్రౌండ్‌లో 2012లో ఒకసారి, 2021లో రెండుసార్లు ఇంగ్లండ్‌పై 3 టెస్ట్‌లు ఆడాడు. 3 మ్యాచ్‌లలోనూ విరాట్‌ నిరాశపర్చాడు. అతను అత్యధిక స్కోరు 27 మాత్రమే. 20 సగటుతో కేవలం 60 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో జరిగిన వన్డేలలోనూ విరాట్‌ రాణించలేదు. 7 వన్డేలలో 25 సగటుతో పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే హాఫ్‌ సెంచరీ మాత్రమే సాధించాడు.

రెండోది ఐ.ఎస్. బింద్రా స్టేడియం(పీసీఏ, మొహాలి) మొహాలీలోని పీసీఏ స్టేడియంలో కూడా విరాట్ కోహ్లి ఇప్పటి వరకు టెస్ట్‌ సెంచరీ చేయలేదు. వన్డే, టీ20లలో మొహాలిలో పరుగుల వరద పారించిన కోహ్లీ టెస్ట్‌లలో విఫలమవడం ఆశ్చర్యమే. మూడంకెల మైలురాయిని చేరుకోనప్పటికీ ఈ గ్రౌండ్‌లో అతని రికార్డు బలంగా ఉంది. 4 టెస్ట్‌లలో 48.80 సగటుతో 244 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 67 నాటౌట్. మొహాలిలో షార్ట్‌ ఫార్మాట్‌లో కోహ్లి అదరగొట్టాడు. వరల్డ్ కప్ టీ20 సమరం 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో భారత్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. అదే సంవత్సరం వన్డేలో న్యూజిలాండ్‌పై 154 పరుగులు చేశాడు.

మూడోది జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం (రాంచీ) 2013లో జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ మొదటి వన్డేకి ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ 2017 మార్చ్ లో ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్‌ జరిగింది. ఈ మైదానంలో విరాట్ టెస్ట్‌ రికార్డు పేలవంగా ఉంది. 2 టెస్ట్‌లు ఆడిన కోహ్లి అత్యధిక స్కోరు 12 మాత్రమే. కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2019 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 123 పరుగులు చేశాడు.



Next Story