జడ్డూ డబుల్ సెంచరీ మిస్.. ద్రవిడ్ నిర్ణయంపై విమర్శలు

by Disha Web Desk 2 |
జడ్డూ డబుల్ సెంచరీ మిస్.. ద్రవిడ్ నిర్ణయంపై విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్:‌ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా రికార్డు క్రియేట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు సాధించిన జడేజా అజేయంగా నిలిచాడు. అతడి టెస్ట్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. 1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కపిల్ దేవ్ 7వ స్థానంలో వచ్చి 163 పరుగులు సాధించిన రికార్డును.. జడేజా అధిగమించాడు.

అయితే, మరో 25 పరుగులు చేస్తే జడ్డూ డబుల్ సెంచరీ పూర్తిచేయనుండగా, టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అనూహ్యంగా డిక్లైర్డ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ద్రవిడ్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా, ద్రవిడ్ ఇలా చేయడం టీమిండియా క్రికెట్ చరిత్రలో రెండోసారి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీమిండియా జట్టు పాకిస్తాన్ టూర్‌ వెళ్లిన సమయంలో సచిన్ 194 పరుగుల వద్ద ఉండగానే ద్రవిడ్ డిక్లైర్డ్ చేశారు. నాడు సచిన్, నేడు జడేజా డిక్లైర్డ్ కారణంగా డబుల్ సెంచరీ చేయలేకపోయారని క్రీడాభిమానులు మండిపడుతున్నారు.


Next Story

Most Viewed