- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ మినీవేలం 2026: టీమిండియా ఓపెనర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
ఐపీఎల్ మినీవేలం 2026: టీమిండియా ఓపెనర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2026 మినీ వేలం ప్రారంభమైంది. తమ జట్లను బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడుతున్నాయి. విదేశీ ఆటగాళ్లను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న ఫ్రాంచైజీలు భారత ఆటగాళ్లపై మాత్రం మొగ్గు చూపడం లేదు. భారత ఆటగాడు, ఓపెనర్ పృద్వీ షా(Prithvi Shah)ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. ఈ వేలంలో మొత్తం 77 మంది క్రీడాకారులు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అబుదాబీ వేదికగా ఈ మినీ వేలం జరుగుతోంది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబయి ఇండియన్స్ చివరిస్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి.






