గ్రూప్‌లో టాప్.. విన్నింగ్ స్ట్రీక్‌లో టీమిండియా..

by Dishafeatures2 |
గ్రూప్‌లో టాప్.. విన్నింగ్ స్ట్రీక్‌లో టీమిండియా..
X

దిశ, వెబ్‌డెస్క్: కేవలం క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ ఇండియా తన సత్తా చాటుతోంది. భారత ప్లేయర్లు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వరుస విజయాలు సాధిస్తూ తామెంటే నిరూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో భారత టీం ఔరా అనిపిస్తుంది. ప్రపంచ దేశాలను తమదైన ఆటతో ఇండియా ఆటగాళ్లు బెంబేలెత్తిస్తున్నారు. గ్రూప్‌ 2లో ఉన్న భారత్ వరుస విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఈ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ 2022లో భాగంగా కజికిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది.

ఈ ఛాంపియన్‌షిప్ ఇది భారత్‌కు వరుసగా మూడో విజయం. అయితే ఇంటియన్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ తన రెండో మ్యాచ్ ఓడిపోయాడు. అంతకుముంద భారత్ 2-1తో లీడ్‌లో ఉంది. ఆ తర్వాత ఆఖరి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ విజయం సాధించడంతో మ్యాచ్ టై అయింది. ఇదే ఉత్సాహంతో భారత ప్లేయర్లు ఆడితే ఛాంపియన్ షిప్ మనదే అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి భారత ప్లేయర్లు ఛాంపియన్‌ షిప్ తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి.


Next Story

Most Viewed